Hyderabad: హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు, 8 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు, దాని విలువ దాదాపు రూ.9 కోట్లు పై మాటే..

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

Drugs| Representational Image (Photo credits: stevepb/Pixabay)

Hyd, Dec 12: హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టు (international drug smuggling gang) రట్టయింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.9 కోట్లు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి కొరియర్‌ ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు.ఇద్దరిని అరెస్టు చేశారు మల్కాజ్గిరి పోలీసులు.

ఈ ముఠా హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్నారని పోలీసులు చెప్పినట్లు ప్రాథమిక సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాపై రాచకొండ పోలీసులు (Rachakonda police) ఉక్కుపాదం మోపుతున్నారు. శనివారం కూడా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సిబ్బందితో కలిసి మంగళ్‌హాట్ పోలీసులు.. ముగ్గురు గంజాయి వ్యాపారులను, ఒక గంజాయి రవాణాదారుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 72 కేజీల గంజాయి, 1.8 కేజీల గంజాయి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాడుబడ్డ పరిశ్రమలో పట్టుబడిన సెక్స్ రాకెట్, దాన్ని గదులుగా మార్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న కొమరం భీం పోలీసులు

ఇందులో ప్రధాన ప్రధాన నిందితుడు హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లోని ధూల్‌పేట్ ఆకాష్ సింగ్‌గా గుర్తించారు. 2018 నుంచి అతను ఖమ్మంకు చెందిన షేక్ సుభానీ నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌లో పలువురు వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఇక, షేక్ సుభానీ ఒడిశా రాష్ట్రంలోని పాపులూరులో గంజాయిని పండించే వల్సగడ్డ మహేష్ నుంచి పెద్దమొత్తంలో గంజాయిని సేకరించి.. హైదరాబాద్‌లో ప్రధాన వ్యాపారి అయిన ఆకాష్ సింగ్‌కు రవాణా చేస్తున్నాడు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్