Sex Racket Busted. (Photo Credit: PTI)

Hyd, Dec 12: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠాను (prostitution-racket bust) పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని (Kumuram Bheem Asifabad District) క్రాస్‌ రోడ్‌లో మూసివేసిన ఓ పరిశ్రమలో వ్యభిచార గృహాలను నిర్వహించడాన్ని గుర్తించారు. నిందితుడిని జనగాం జిల్లాకు చెందిన మడసి రమేష్ కుమార్‌గా పోలీసులు నిర్ధారించారు.

ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నుండి మహిళలను తెప్పించి గుట్టుచప్పుడు ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం తో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్విస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెబ్బెన పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్‌లో 14,190 మందితో అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌, వల వేసి పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు, 17 మంది అరెస్ట్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీసులు ( Cyberabad police) గత వారం భారీ సెక్స్‌ రాకెట్‌ ముఠాను పట్టుకున్న సంగతి విదితమే. 17 మందిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.వీరి నుంచి ఏపీ, తెలంగాణ, కర్నాటక, ముంబై, ఢిల్లీతో పాటుగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, థాయిలాండ్‌, రష్యా దేశాలకు చెందన బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, 17 మంది సభ్యులు హైదరాబాద్‌ వేదికగా అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ను (International Sex racket) నిర్వహిస్తున్నారు.

సికింద్రాబాద్‌లో దారుణం.. కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!

సమాచారం తెలుసుకున్న సైబరాబాదం పోలీసులు.. 39 కేసుల్లో 17 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, ఈ ముఠా పలు వెబ్‌సైట్లలో ఎస్కార్ట్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను, మహిళలను ఉపాధి పేరుతో తీసుకువచ్చి వారిని ఈ ముఠా వ్యభిచారం కూపంలోకి దింపుతోందని పోలీసులు వెల్లడించారు.