Constable Suicide: తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Hyderabad, Sep 28: రంగారెడ్డి జిల్లా (Rangareddy) కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ (Constable Suicide) తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడిని మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణగా గుర్తించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేసిన అతను ఇటీవలే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు బదిలీ అయ్యి అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తెల్లవారుజామున..
అయితే, శనివారం తెల్లవారుజామున 03:30 గంటల ప్రాంతంలో విధుల్లో ఉండగానే తన తుపాకితో తానే కాల్చుకొని బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అధికారులు పేర్కొన్నారు. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేరని వెల్లడించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
బీజేపీ కుట్రలో భాగమే ఈడీ దాడులు, కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమి లేదన్న అద్దంకి దయాకర్..వీడియో ఇదిగో