IPL Auction 2025 Live

Telangana Police: తెలంగాణ పోలీసుల హెచ్చరిక, సోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు పెడితే కఠిన చర్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపిన తెలంగాణ డీజీపీ

పోలీసులకు దుండుగులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) అలర్ట్ అయింది. సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana Director General of Police M. Mahender Reddy) రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు.

Telangana DGP Mahender Reddy (File photo)

Hyderabad, Aug 12: సోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు పెట్టడంతో బెంగుళూరులో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. పోలీసులకు దుండుగులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) అలర్ట్ అయింది. సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana Director General of Police M. Mahender Reddy) రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పడు పోస్టులు బెంగళూరులో (Bengaluru violence) ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో అందరూ తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు ( inappropriate social media posts) పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని తెలంగాణ డీజీపీ అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటి వారిపై వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలిచ్చామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Look on The Tweets

ప్రజలు పోలీసులతో సహకరించి భద్రత, రక్షణలో తెలంగాణను ఉన్నత స్థానంలో ఉంచేందుకు సహకరించాలని కోరారు. ఇక సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్ట్‌ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని హైదరాబాద్‌ నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ (Hyderabad Police Commissioner Anjani Kumar) స్పష్టం చేశారు. ఒక పోస్ట్‌ ఫలితంగా బెంగళూరులో ఘర్షణలు జరిగాయని గుర్తు చేశారు. బాధ్యత లేని, అభ్యంతరకరమైన సోషల్‌ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో పేర్కొన్నారు. గుడిని కాపాడేందుకు ముస్లీంలు మానవహారం, బెంగుళూరు అల్లర్లలో వెల్లివిరిసిన మతసామరస్యం, సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియో ఇదే

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్‌ సోషల్‌ మీడియాలో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయడంతో బెంగుళూరులో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. బెంగుళూరులో ఇప్పుడు 11 సెక్షన్ అమలులో ఉంది.