Bengaluru, August 12: సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు (Derogatory Facebook Post) కర్ణాటక రాజధాని బెంగళూరులో కల్లోలానికి (Bengaluru Violence) దారి తీసింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి బంధువు ఒకరు ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టు పెట్టడంతో బెంగుళూరులో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు (inciting social media post) పెట్టారంటూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అండతోనే అతడు ఇలా చేస్తున్నాడని భావించిన కొంతమంది వ్యక్తులు అతడిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం రాత్రి కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే (Congress MLA Srinivas Murthy) నివాసంపై దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకుతో పాటు కూతురుకి సమాన హక్కు, సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, హిందూ వారసత్వ చట్టం-2005 అనుగుణంగా తీర్పు
ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. ఆందోళనకారుల దాడిలో ఏసీపీ సహా 60 మంది పోలీసులు గాయపడ్డారని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో సిటీలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.
Update by ANI
Congress MLA Srinivas Murthy's residence in Bengaluru vandalised, allegedly over an inciting social media post by his nephew. Karnataka Home Minister says, "Issue to be probed but vandalism is not the solution. Additional forces deployed. Action will be taken against miscreants." pic.twitter.com/Xa1q6SI6mG
— ANI (@ANI) August 11, 2020
#UPDATE Accused Naveen arrested for sharing derogatory posts on social media: Bengaluru Police Commissioner Kamal Pant
Two persons died and around 60 police personnel sustained injuries in the violence that broke out over the social media post, in Bengaluru last night.#Karnataka https://t.co/VlZKo8CW3d
— ANI (@ANI) August 12, 2020
డీజే హళ్లి, కేజే హళ్లి పోలీసు స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని సీపీ కమల్ పంత్ స్పష్టం చేశారు. బెంగళూరు నగరంతోపాటు కేజే హళ్లి, డీజే హళ్లిలో నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 110 మందిని అదుపులోకి బెంగళూరు జాయింట్ కమిషనర్(క్రైం) సందీప్ పాటిల్ తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి దర్యాప్తుకు ఆదేశించారు. దాటికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంటల్లో చిక్కుకున్న బస్సు, అయిదు మంది సజీవ దహనం, పలువురికి గాయాలు, కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర విషాద ఘటన
కర్ణాటక రాజధాని బెంగుళూరులో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. శాంతియుత వాతావరణం కల్పించడానికి అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రజలందరూ సంయనం పాటించాలని ఆయన కోరారు.