Hyderabad, FEB 01: హైదరాబాద్‌లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ప్రీజం పబ్ లో కాల్పులు జరిగాయి. ప్రీజం పబ్‌లో దొంగతనానికి వచ్చిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు మాదాపూర్ సీసీఎస్ పోలీసులు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన దొంగ.. వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రామిరెడ్డి తోడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పబ్‌లో పని చేస్తున్న బౌన్సర్లకు కూడా గాయాలయ్యాయి.
ఎట్టకేలకు ప్రభాకర్‌ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయపడిన కానిస్టేబుల్ వెంకటరామిరెడ్డిని చికిత్స కోసం సమీప దవాఖానకు తరలించారు.