Delhi Liquor Scam: కవితకు మళ్లీ షాకిచ్చిన కోర్టు.. 21 వరకు రిమాండ్ పొడిగింపు

సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన స్పెషల్ కోర్టు..

Kavitha Arrest (photo-ANI)

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మళ్లీ షాకిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన స్పెషల్ కోర్టు.. కవిత జ్యూడీషియల్ కస్టడీని ఈ నెల 21వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. కాగా.. ఇదే కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కూడా కవిత జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. ఆ కేసులో ఈ నెల 3వ తేదీన కవిత కస్టడీ ముగియగా.. తిరిగి విచారణ జరిపిన స్పెషల్ కోర్టు.. వచ్చే నెల 3వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 15న ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నారు. కొన్నాళ్లు ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇక ఏప్రిల్ 11న ఇదే కేసులో సీబీఐ కూడా కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కేసులో కూడా కవిత జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif