Floods Damage in Telangana: వరదలతో రూ. 1400 కోట్లు నష్టం, కేంద్రానికి ప్రాథమక నివేదిక పంపిన రాష్ట్రప్రభుత్వం, ఏయే శాఖల్లో ఎంత నష్టమో తెలుసా?
పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది.
Hyderabad, July 21: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు (Floods) సంభవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం(Bhdrachalam), పరిసర ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, గోదావరి శాంతించడంతో పెను ముప్పు తప్పింది. అయితే వర్షాల కారణంగా భారీ నష్టమే వాటిల్లింది. రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు (disaster) మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను (report) రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది.
వెంటనే తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్ శాఖలో రూ.449 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో రూ.33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో రూ.379కోట్లు, విద్యుత్‌శాఖలో రూ.7కోట్ల మేర నష్టం వాటినట్లు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి పంపించాయి.
అదే సందర్భంలో ఇండ్లు కూలిపోవడం, ముంపునకు గురికావడంతోపాటు ముంపు బాధితులను తరలించే క్రమంలో రూ.25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు కలిపి మొత్తంగా రూ.1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి అధికారులు నివేదిక పంపారు.