Sandeep Shandilya: హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా సందీప్ శాండిల్య, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం సందీప్ శాండిల్య పోలీసు అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ఈసీ ఆదేశాల‌కు అనుగుణంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి

Sandeep Shandilya (photo-File Image)

హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా సందీప్ శాండిల్య నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం సందీప్ శాండిల్య పోలీసు అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ఈసీ ఆదేశాల‌కు అనుగుణంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆయన బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.ఢిల్లీకి చెందిన సందీప్‌ శాండిల్య.. ఇంతకు ముందు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. గతంలో సైబరాబాద్‌ సీపీగా, రైల్వే అడిషనల్ డీజీగా విధులు నిర్వహించారు.

హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని సందీప్‌ శాండిల్య అన్నారు. ‘‘ఎలక్షన్ కమీషన్ ఇచ్చిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తాం. టెక్నాలజీకి తగ్గట్టుగా పని చేస్తాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తాం’’ అని తెలిపారు. 1993 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన సందీప్ శాండిల్య గుంటూరులో మొదటి పోస్టింగ్ పొందారు.

తెలంగాణాలో కొత్తగా నియమితులైన ఎస్పీలు, కమిషనర్ల లిస్ట్ ఇదిగో

నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్, డీసీపీగా చేశారు. సీఐడీ, ఇంటిలిజెంట్ సెక్యూరిటీ వింగ్‌లో, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. అడిషనల్ డీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీగా విధులు నిర్వహించిన శాండిల్య.. జైళ్ల శాఖ డీజీగానూ మూడు నెలల పాటు పనిచేశారు.