Election Commission of India. (Photo Credit: Twitter)

Hyd, Oct 13: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొత్తగా ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి.. వివరాలను రాష్ట్రానికి పంపించింది. దీంతో తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

హైద‌రాబాద్ సీపీ మిన‌హా అన్ని పోస్టుల నియామకాలపై ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్‌, నిజమాబాద్‌కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది. ఈసీ పంపించిన జాబితాలోని ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి జీవో విడుదల చేశారు. కొత్తగా నియమితులైన అధికారులు శుక్రవారం సాయంత్రంలోగా బాధ్యతలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. హైదరాబాద్‌ సీపీ మినహా మిగతా పోస్టులను భర్తీ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

 ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం, తెలంగాణలో 20 మంది అధికారులపై వేటు, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశాలు

రానున్న తెలంగాణా ఎ‍న్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈసీ ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసిన సంగతి విదితమే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ సహా నలుగురు జిల్లాల కలెక్టర్ల, 13 మంది IPS అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది. అయితే హైదరాబాద్‌ సీపీను పేరును ఇంకా పెండింగ్‌లో ఉంచడం గమనార్హం.

ఈసీ ఎంపిక చేసిన ఐఏఎస్‌లు వీరే..

రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌

రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి

మేడ్చల్‌ కలెక్టర్‌గా గౌతం

యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్‌

నిర్మల్‌ కలెక్టర్‌గా ఆశీష్‌ సంగ్వాన్‌

ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్‌ శర్మ

ఎక్సైజ్‌ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్‌

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా

ఐపీఎస్‌లు వీరే..

జగిత్యాల ఎస్పీగా సంప్రీత్‌ సింగ్‌

నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కల్మేశ్వర్‌

సంగారెడ్డి ఎస్పీగా చెన్నూరి రూపేష్‌

కామారెడ్డి ఎస్పీగా సింధూ శర్మ

మహబూబ్‌నగర్‌ ఎస్పీగా హర్సవర్ధన్‌

నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా వైభవ్‌ రఘునాథ్‌

జోగులాంబ గద్వాల్ ఎస్పీగా రితిరాజ్‌

మహబూబాబాద్‌ ఎస్పీగా పాటిల్‌ పంగ్రామ్‌సింగ్‌ గణపతిరావ్‌

నారాయణపేట్‌ ఎస్పీగా యోగేష్‌ గౌతమ్‌

భూపాలపల్లి ఎస్పీగా కిరణ్‌ ప్రభాకర్‌

సూర్యాపేట ఎస్పీగా రాహుల్‌ హెగ్డే

►వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్-అంబ‌ర్ కిషోర్ ఝా

►నిజామాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ -కల్మేశ్వ‌ర్ సింగేనేవ‌ర్