Sangareddy Student Suicide: కూతురు ఆత్మహత్య, తండ్రిని బూటుకాలుతో తన్నిన కానిస్టేబుల్, పోలీస్ శాఖ తరపున చింతిస్తున్నామని తెలిపిన ఇన్‌చార్జి ఎస్పీ చందనాదీప్తి

సర్దిచెప్పాల్సిన పోలీసులు సహనం కోల్పోయి మృతురాలి తండ్రిని బూటుకాలితో తన్నారు. బలవంతంగా మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Police kicking suicide victim's father goes viral higher-officials-taken-action-against-police (Photo-ANI)

Hyderabad, Febuary 27: మహబూబ్‌నగర్ జిల్లా ఎనుగొండకు చెందిన చంద్రశేఖర్, పద్మ దంపతుల కుమార్తె సంధ్యారాణి 25 ఫిబ్రవరి 2020వ తేదీన సంగారెడ్డి జిల్లా (Sangareddy) పఠాన్‌చెరులోని నారాయణ జూనియర్ కాలేజీలో బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పటాన్‌చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి (Patancheru government hospital) సంధ్యారాణి మృతదేహాన్ని తరలించారు. ఈ నేపథ్యంలో ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మాయమాటలు చెప్పి ఐదుగురు అక్కా చెల్లెళ్లపై అత్యాచారం

మార్చురీ తాళం పగలగొట్టి సంధ్యారాణి మృతదేహాన్ని కాలేజ్‌కు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రయత్నించారు. నారాయణ కాలేజ్ యాజమాన్యం కారణంగానే తమ కూతురు మరణించిందని సంధ్యారాణి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పఠాన్‌చెరు ఏరియా ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు.

ఆందోళన సమయంలో పోలీసులు మృతురాలి తండ్రిని బూటు కాళ్లతో (Cop Kicking Suicide victim's Father) తన్నారు. సర్దిచెప్పాల్సిన పోలీసులు సహనం కోల్పోయి మృతురాలి తండ్రిని బూటుకాలితో తన్నారు. బలవంతంగా మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Cop Kicking Suicide victim's Father

దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విద్యార్థిని చనిపోయిందని చెబుతున్న గదిని చూపిస్తామని మృతురాలి బంధువులను తీసుకువెళ్లారు. మరోవైపు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆస్పత్రి పోస్టుమార్టం గది తలుపులు పగలగొట్టిన ఘటనలో విద్యార్థి సంఘం నాయకులపై కేసు నమోదు చేసినట్లు పటాన్‌చెరు సీఐ నరేశ్‌ తెలిపారు.

కానిస్టేబుల్‌ శ్రీధర్‌ మృతిరాలి తండ్రితో దురుసుగా ప్రవర్తించడంపై శాఖ తరఫున చింతిస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్పీ చందనాదీప్తి (superintendent of police Chandana Deepti) అన్నారు. కానిస్టేబుల్‌ను ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌ సంగారెడ్డికి అటాచ్‌ చేశామన్నారు. ఘటనపై విచారణ జరుపుతామన్నారు.

పటాన్ చేరు పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ (పీసీ 349) మృతురాలి తండ్రిపై దురుసుగా ప్రవర్తించిన తీరు బాధాకరం, పోలీసు డిపార్ట్ మెంట్ తరపున చింతిస్తున్నాం అంటూ పోలీసులు ప్రకటన చేశారు. వైరల్ అయిన వీడియోలను పూర్తిగా విశ్లేషించి పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.