Stock Market Fraud via WhatsApp: అమ్మాయి వాట్సాప్ చాట్, ఏకంగా స్టాక్ మార్కెట్‌లో కోటి ఇన్వెస్ట్‌మెంట్, తీరా చూస్తే?

సైబర్ క్రైమ్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు ఎన్ని విజ్ఞప్తులు చేసిన దేశంలో ప్రతిరోజు ఏదో చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్న వారు సైతం ఈ మోసాల బారిన పడుతుండటం విశేషం. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక అమ్మాయి వాట్సాప్ చాట్ నమ్మి ఏకంగా కోటి రూపాయలు మోసపోయాడు ఓ వ్యక్తి. ఇప్పుడు ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

stock market(X)

Hyd, July 24: రోజుకో రూపంలో సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. సైబర్ క్రైమ్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు ఎన్ని విజ్ఞప్తులు చేసిన దేశంలో ప్రతిరోజు ఏదో చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్న వారు సైతం ఈ మోసాల బారిన పడుతుండటం విశేషం. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక అమ్మాయి వాట్సాప్ చాట్ నమ్మి ఏకంగా కోటి రూపాయలు మోసపోయాడు ఓ వ్యక్తి. ఇప్పుడు ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఏపీఆర్‌ హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు బెజవాడ నాగార్జున(36). స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి లాభాలను గడించాలని నాగార్జున కోరి. ఇందుకోసం ఎంతోమందిని సంప్రదించాడు. ఆన్‌లైన్‌లో సైతం తన మెదడుకు పదునుపెట్టి రీసెర్చ్ చేశాడు. దీనిని ఆసరాగా తీసుకున్న సైబర్ కేటుగాళ్లు పంజా విసిరారు.

నదియా కమీ అనే అమ్మాయితో ఎర వేశారు. నాగార్జునకు ఓ రోజు నదియా నుండి వాట్సాప్ మెస్సేజ్ వచ్చింది. తాను చెప్పినట్లు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలను గడించవచ్చని నమ్మించింది. అసలే అమ్మాయి, ఆమె మాటలు టెంప్టింగ్‌గా ఉండటమే కాదు లాభాలు వస్తాయని చెప్పడంతో నమ్మాడు నాగార్జున. ఆ మహిళ సూచించిన విధంగా పలు అకౌంట్లలోకి ఏకంగా 99 లక్షల 78 వేల 526 రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు.

ఆ తర్వాత ఆమె నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఆలస్యంగానైనా తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. తక్షణమే పోలీసులు ఫ్రాడ్‌ స్టార్స్‌ అకౌంట్లను తనిఖీ చేసి రూ.34 లక్షలు ఉన్నట్టు గుర్తించి ఆ ఖాతాలను ఫ్రీజ్‌ చేయించామని పటాన్‌చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.

సైబర్ క్రైమ్ జరిగిన గంటలోపు 1930కి ఫిర్యాదు చేస్తే బాధితుల సొమ్మును పూర్తిగా రికవరీ చేయవచ్చని వెల్లడించారు. స్టాక్ మార్కెట్‌ వ్యవహారాల్లో బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని, అత్యాశకు పోతే మోసపోవడం తప్ప ఇంకేమి మిగలదని చెబుతున్నారు.  హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డోర్ డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్,22 కిలోల గంజాయి స్వాధీనం



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన