Hyderabad: ఉరుములు మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు

ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, యూసఫ్‌గూడ్, కూకట్‌పల్లి‌.. ఇలా చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది.

Rains Lash Telangana (Photo-Video Grab)

అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో.. ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, యూసఫ్‌గూడ్, కూకట్‌పల్లి‌.. ఇలా చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి.

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించడం.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఈ ప్రభావం కొనసాగవచ్చని తెలుస్తోంది.



సంబంధిత వార్తలు