Supreme Court on KCR Petition: తెలంగాణ విద్యుత్‌ ఒప్పందాలపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్‌... విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని సూచన

తెలంగాణలో విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

Supreme Court on KCR Petition (Pic Credit to ANI)

Del,Jul 16: తెలంగాణలో విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. అక్కడ కేసీఆర్‌కు చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్ ఎలా పెడతారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు సీజేఐ చంద్రచూడ్. కమిషన్ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని...కమిషన్ ఛైర్మన్ న్యాయం చెప్పటమే కాకుండా నిస్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

ఇక అలాగే కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డిని తప్పించాలని కొత్త ఛైర్మన్‌ను నియమించి ఆ పేరును తమకు చెప్పాలని సూచించారు సీజేఐ చంద్రచూడ్. నరసింహరెడ్డి కమిషన్ నియమించిన వారు కూడా కమిటీలో ఉండకూదని కమిటీ కాలపరిమితి, విధివిధానాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అల్పాహారం పథకం పేరిట బ్రేక్ ఫాస్ట్‌ను అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి అల్పాహారం పథకం పేరిట బ్రేక్ ఫాస్ట్‌ను అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తాజాగా ఇదే స్కీంను తమిళనాడులోని ఎయిడ్ స్కూళ్లలో ఉచితంగా విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని సోమవారం ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రారంభించారు.

కేసీఆర్‌ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్‌ తరఫున గోపాల్‌శంకర్‌ నారాయణన్‌ తమ వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో వేసిన కమిషన్ అని ....ప్రభుత్వం మారిన ప్రతిసారి మాజీ సీఎంలపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందన్నారు ముకుల్ రోహిత్గీ. మార్కెట్ రేట్ కంటే తక్కువగా తాము యూనిట్ 3.90 రూపాయలకే కొనుగోలు చేశామని తెలిపారు. విచారణకు ముందే కమిషన్ ఛైర్మన్ నరిసింహా రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి దోషిగా తేల్చారాని ఇది సరికాదని వాదించారు.

ప్రెస్ మీట్‌లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారని తెలిపారు సిద్ధార్థ్ లుథ్రా. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులు అన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తుంటే.. భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారని దీంతో ప్రభుత్వ ఖజానాకు వ్యయం భారీగా పెరిగిందన్నారు. ఇక ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ ఛైర్మన్ పదవి నుండి తప్పించాలని సూచించారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

TTD Chairman on Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి దర్శనంపై టీటీడీ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు, ఈ నెల 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయన్న బీఆర్ నాయుడు

Telangana Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు పెట్టుబడి సాయం, రేషన్‌ కార్డులపై కేబినెట్ భేటీలో నిర్ణయం