Supreme Court On Note For Vote Case: సుప్రీం కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి రిలీఫ్, ఓటుకు నోటు కేసును బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ
ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయబోమని తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
Delhi, Sep 20: ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయబోమని తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
కేసు విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని అలాగే ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్‌కు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది. దీంతో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి రిలీఫ్ దక్కినట్లు అయింది. దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బతకలేరు, చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం మండిపడగా క్షమాపణ చెప్పారు రేవంత్. ఇందుకు సంబంధించి రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు..సీఎం క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఈ అంశాన్ని మరింత ముందుకు సాగదీయాలనుకోవడం లేదని అభిప్రాయపడింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉంటుందని..అయితే ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించింది.