Telangana Assembly Elections 2023: సీఎం కేసీఆర్‌ షాకిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్లే, రాజయ్యకు మొండి చేయి చూపిన తెలంగాణ ముఖ్యమంత్రి

మొత్తం తొమ్మిది చోట్ల సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు.

CM KCR (Photo-ANI)

Hyd, August 21: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ షాకిచ్చారు. మొత్తం తొమ్మిది చోట్ల సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. వేములవాడ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, కోరుట్ల, ఉప్పల్‌, ఖానాపూర్‌, అసిఫాబాద్‌, కామారెడ్డి, బోథ్‌,వైరా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

వీరిలో 2009 నుంచి కామారెడ్డిలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన గంపగోవర్దన్‌ రెడ్డి.. కేసీఆర్‌ కోసం సీటు త్యాగం చేశారు. ఇక కోరుట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన కొడుకు డాక్టర్ సంజయ్‌కు టికెట్‌ కేటాయించారు. మిగిలిన ఏడుచోట్ల అభ్యర్థులను మార్చారు. ఇక హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. కామారెడ్డి, గజ్వేల్‌ స్థానాల నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్నారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని(నర్సాపుర్‌, జనగామ, నాంపల్లి, గోషామహల్) , ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు.

సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే మరోసారి టికెట్లు కేటాయించామని, వారందరికీ అభినందనలు తెలుపుతూ.. మరోసారి అద్భుత విజయం సాధించాలని కోరారు. మొత్తం 119 స్థానాల్లో ప్రస్తుతం 114 మంది అభ్యర్థులను ప్రకటించగా.. నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఎమ్మెల్యే మైనంపల్లికి మల్కాజ్ గిరిలో టికెట్‌ ఇచ్చామని, ఆయన కొడుకు రోహిత్ కు మెదక్ లో అడిగినా ఇవ్వలేకపోయామన్నారు. ఇవ్వాళ తిరుమలలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడిన కెసిఆర్.. మైనంపల్లి పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టానికే వదిలేస్తున్నామని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలా? వద్దా? అన్నది మైనంపల్లి నిర్ణయించుకోవాలని చెప్పారు.

టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వీరే

►ఉప్పల్‌ - సుభాష్‌ రెడ్డి

►బోథ్‌ - రాథోడ్‌ బాపూరావు

►ఖానాపూర్‌ - రేఖా నాయక్‌

►అసిఫాబాద్ - ఆత్రం సక్కు

►వైరా - రాములు నాయక్‌

►కామారెడ్డి - గంప గోవర్ధన్‌

►స్టేషన్‌ ఘన్‌పూర్‌ - రాజయ్య

పెండింగ్ స్థానాలు ఇవే

►నర్సాపుర్‌

►జనగామ

►నాంపల్లి

►గోషామహల్

కోర్టు కేసు కారణంగా నిరాకరణ

►వేములవాడ - చెన్నమనేని రమేష్‌

సిట్టింగ్ ల వారసులు వీరే

►కోరుట్ల - ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్

►సికింద్రాబాద్ కంటోన్మెంట్ - దివంగత సాయన్న కూతురు లాస్య



సంబంధిత వార్తలు

Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif