MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్న కాషాయ పార్టీ
సస్పెన్షన్ ఎత్తివేస్తూ అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల కానుంది. ఇక, ఈ జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ కు 70, కాంగ్రెస్ కు 34, బీజేపీకి 7 సీట్లు వస్తాయని వెల్లడించిన ఇండియా టీవీ సర్వే
కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారని, మరికొందరి విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నేతలు చెప్తున్నా.. అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.