Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామని చెప్పారు.ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

YS Sharmila (Photo-Video Grab)

వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామని చెప్పారు.ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులన్నా, కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు... తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని తెలిపారు.

నేటి నుంచి తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎన్నుకోవాలంటూ ఈసీ నోటిఫికేషన్

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని... తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని షర్మిల చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని... అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డకోకూడదనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు.



సంబంధిత వార్తలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో..

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్