BTech Student Commits Suicide: బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదని బావిలో దూకి విద్యార్థి ఆత్మహత్య, సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన

సంగారెడ్డి మండల పరిధిలోని విఠలాపూర్‌లో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దొరకడం లేదని బిటెక్ చదివిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు

Representational Image (Photo Credits: File Image)

Sangareddy, August 3: సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి మండల పరిధిలోని విఠలాపూర్‌లో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దొరకడం లేదని బిటెక్ చదివిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటలక్ష్మి, లక్ష్మారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు.

పెద్ద కుమారుడు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా, చిన్నకుమారుడు ఉపేందర్‌రెడ్డి (25) బీటెక్‌ పూర్తి చేశాడు. ఏడాదిగా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు వెతుకుతున్నాడు. తనకు ఉద్యోగం రాకపోవడం.. తోటి స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారని సన్నిహితులతో చెబుతూ బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న తన మేనమామ తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్ద మోటారు మరమ్మతుల కోసం ఆయనతో కలిసి వెళ్లాడు.పని ముగించుకొని తిరుపతిరెడ్డి ఇంటికి రాగా.. ఉపేందర్‌రెడ్డి రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో రాత్రి తన మామ వాళ్ల ఇంట్లోనే ఉన్నాడని కుటుంబీకులు భావించారు.

ప్రియుడు కాదు కామాంధుడు, ఆ ఫోటోలను చూపిస్తూ స్నేహితులతో కలిసి ప్రియురాలిపై పదే పదే అత్యాచారం

బుధవారం ఉదయం తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా గట్టుపైన ఉపేందర్‌ సెల్‌ఫోన్‌, డ్రెస్‌ ఉండడంతో కుటుంబీకులకు సమాచారం అందించాడు. బావిలో వెతకగా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుభాశ్‌గౌడ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.