Telangana Budget Session: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. వాడీవేడి చర్చకు అధికార, విపక్షాలు సిద్ధం
ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Hyderabad, Feb 3: తెలంగాణలో (Telangana) నేటినుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Session) ఆరంభం కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ (Governor) తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనుండడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే, టీఆర్ఎస్ (TRS) పార్టీ బీఆర్ఎస్‌గా (BRS) మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కూడా ఇవే. మరోవైపు, ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ సిద్ధమవుతున్నాయి. దీంతో సమావేశాలు వాడీవేడిగా జరగే అవకాశం ఉంది.
ఈ సమావేశాలను రెండు వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేడు గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదా వేస్తారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. ఆదివారం సెలవు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. మంగళవారం సభకు సెలవు. ఆ తర్వాతి నుంచి సమావేశాలు కొనసాగుతాయి. 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నూతన సచివాలయాన్ని ప్రారంభించనుండడంతో 16నే సమావేశాలు ముగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కన్నుమూసిన కళా తపస్వి కె. విశ్వనాథ్, దివికేగిన శంకరాభరణం, శివైక్యమైన స్వాతిముత్యం..
మరోవైపు, తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాదే ఎన్నికలు జరగనుండడంతో ప్రభుత్వానికి ఈ బడ్జెట్ కీలకం కానుంది. బడ్టెను రూ. 3 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాసనభ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.