Telangana: తెలంగాణ డీజీపీకి షాకిచ్చిన కేటుగాళ్లు, ఆయన ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టి ఉన్నతాధికారులకు డబ్బులు ఇవ్వాలని మెసేజ్‌లు, అలర్ట్ అయిన సైబర్ క్రైమ్ పోలీసులు

తాజాగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతోనూ మోసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటుగాళ్లు తెలంగాణ పోలీసు బాస్‌ను టార్గెట్‌ చేశారు.

Telangana DGP Mahender Reddy (File photo)

Hyd, June 28: అమాయకులకు మాయమాటలు చెప్పి సులువుగా బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. తాజాగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతోనూ మోసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటుగాళ్లు తెలంగాణ పోలీసు బాస్‌ను టార్గెట్‌ చేశారు. ఒక వాట్సాప్‌ నంబర్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా (DGP M Mahendar Reddy DP) పెట్టి ఏకంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులకే సందేశాలు పంపించారు. ‘అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది. తొందరగా పంపండి. కొద్ది రోజుల్లో తిరిగి పంపిస్తా’ అంటూ మేసేజ్‌లు చేశారు. ఈ విషయాన్ని ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డికి (DGP M Mahendar Reddy) దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం, హాజరయిన సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు

అప్రమత్తమైన ఆయన.. ఎవరూ డబ్బులు పంపించవద్దని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను (Cyber crime police of Hyderabad) ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డీజీపీ మహేందర్‌రెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, తదితర సోషల్‌ మీడియా ఖాతాలున్నాయి. అందులో పోలీసు శాఖకు సంబంధించిన విషయాలను ఆయన పోస్టు చేస్తుంటారు. ఆ ఖాతాల్లో ఉన్న ఫొటోను డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఒక వాట్సాప్‌ నంబర్‌కు డీపీగా సైబర్‌ నేరగాళ్లు పెట్టారు. అలాగే, పోలీసు శాఖకు చెందిన వెబ్‌సైట్‌లలో ఉన్నతాధికారుల ఫోన్‌ నంబర్లను సేకరించి సందేశాలు పంపించారు.



సంబంధిత వార్తలు

Fashion Tips: చలికాలంలో మీ చర్మం పొడిబారకుండా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఈ ఫుడ్స్ లో యాడ్ చేసుకోవాలి.

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

HYDRA Complaints: అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం... అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్