Megastar Chiranjeevi Hosted Dinner: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ పార్టీ, హాజ‌రైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇత‌ర మంత్రులు, పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇవిగో!

పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం అన్నారు

Megastar Chiranjeevi Hosted Dinner (PIC@ CMO Telangana X)

Hyderabad, FEB 04: మెగాస్టార్ చిరంజీవిని (Megastar Chiranjeevi) కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ తో (Padma Vibhushan) సత్కరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం మెగాస్టార్ కు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. ముఖ్యంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవికి రాజకీయ, సినీ, పలు రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన సందర్భంగా కోడలు ఉపాసన కొణిదెల హైదరాబాద్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

 

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం అన్నారు. వారికి నా హృధయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నన్ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. చిరు కుటుంబం ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్, పలువురు ప్రముఖులు పాల్గొన్న సందర్భంగా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రేవంత్ రెడ్డి మెగాపవర్ స్టార్ రాంచణ్ తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ కనిపించారు. ఇదిలాఉంటే.. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని ఘనంగా సత్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ (ఆదివారం) ఉదయం 10గంటలకు శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొని చిరంజీవితో పాటు పద్మ అవార్డుల గ్రహీతలను సన్మానించనున్నారు.



సంబంధిత వార్తలు