Konda Pochamma Sagar Reservoir: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఐదు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చనున్న రిజర్వాయర్
కొండపోచమ్మ జలాశయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్ (Telangana CM KCR) దంపతులు నేడు ప్రారంభించారు. రిజర్వాయర్ ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునే కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్(మర్కూక్) వద్ద సుదర్శన యాగం, ప్రాజెక్టు నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం ప్రారంభమయ్యాయి.
Hyderabad, May 29: కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి (Konda Pochamma Sagar Reservoir) గోదావరి జలాలను తరలివెళ్లాయి. కొండపోచమ్మ జలాశయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్ (Telangana CM KCR) దంపతులు నేడు ప్రారంభించారు. రిజర్వాయర్ ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునే కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్(మర్కూక్) వద్ద సుదర్శన యాగం, ప్రాజెక్టు నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఒక్కరోజులోనే 117 పాజిటివ్ కేసులు నమోదు, ఇందులో 66 మాత్రమే రాష్ట్రానికి చెందినవి అని వివరణ ఇచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ
ఉదయం 7 గంటల ప్రాంతంలో కొండపోచమ్మ ఆలయానికి (Kondapochamma Temple) చేరుకున్న కేసీఆర్ దంపతులు చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొన్నారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్‌లో కలిపారు.కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
Here's Telangana CMO Tweet
కొండపోచమ్మ సాగర్‌లోకి నీరు చేరికతో ప్రాజెక్టులోని తుది.. 10వ దశ ఎత్తిపోతలు పూర్తి అయ్యాయి. దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అదేవిధంగా హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు తీర్చేలా 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది.
557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్ నుంచి తుక్కాపూర్ పంప్‌హౌజ్ అక్కడి నుంచి అక్కారం, మర్కూర్ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడం ద్వారా గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ కు చేరుకుంటాయి. లక్ష్మీబరాజ్ నుంచి సుమారు 214 కిలోమీటర్లు ప్రవహించి ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తుకు చేరుకుంటాయి. దీంతో తెలంగాణలోని అత్యంత ఎత్తైన ప్రాంతానికి కాళేశ్వర జలాలు చేరుకుంటాయి.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ రాష్ర్టంలోని ఐదు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చనుంది. ఐదుజిల్లాలో మొత్తం 2,85,280 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
కొండపోచమ్మ రిజర్వాయర్ వివరాలు
సామర్థ్యం : 15 టీఎంసీలు
వలయాకారం కట్ట: 15.8 కిలోమీటర్లు
ప్రాజెక్టు వ్యయం : 1,540 కోట్లు
మొత్తం ఆయకట్టు : 2,85,280 ఎకరాలు
ప్రధాన స్లూయిస్‌లు: సంగారెడ్డి ప్రధాన కెనాల్, కేశవపూర్ కెనాల్, జగదేవ్‌పూర్ కెనాల్
లబ్ధిపొందనున్న జిల్లాలు: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, యదాద్రి భువనగిరి
ప్రధాన కాల్వలు: రామాయంపేట, గజ్వేల్, ఉప్పరపల్లి, కిష్టాపూర్, తుర్కపల్లి, జగదేవ్‌పూర్, తుర్కపల్లి(ఎం), శంకరంపేట, సంగారెడ్డి