BR Ambedkar Death Anniversary 2022: హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున 125 అడుగుల అంబేదర్‌ విగ్రహం,ఆయన జీవితం సదా ఆచరణీయమైనది, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా (BR Ambedkar Death Anniversary 2022) ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు.

CM KCR Meeting (Photo-TS CMO)

Hyd, Dec 6: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా (BR Ambedkar Death Anniversary 2022) ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు.

ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించాలనే అంబేదర్‌ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కూడా సకల జనుల సాధికారత దిశగా కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. తరతరాలుగా సామాజిక ఆర్థిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల అభ్యున్నతికి కనీవినీ ఎరుగని రీతిలో అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ప్రేరణ, స్ఫూర్తి అంబేదర్‌ మహాశయుడేనని సీఎం కేసీఆర్‌ (CM KCR) తెలిపారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి, నివాళులు అర్పించిన సీఎం జగన్, అంబేద్కర్‌ సేవలను గుర్తు చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి

ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా.. సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం పరిఢవిల్లేలా కలిసి మెలసి జీవించాలనే వసుధైక కు టుంబ ధృక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన మహనీయుడు అంబేద్కర్‌ అని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్‌ ఆరో తేదీ అంబేదర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన జాతికి చేసిన సేవలను సీఎం కేసీఆర్‌ స్మరించుకొన్నారు.

తాను అనుభవించిన సామాజిక వివక్షను సవాల్‌గా తీసుకొని విజయం సాధించి విశ్వమానవ సౌభ్రాతృత్వానికి దిక్సూచిగా నిలిచి, ప్రపంచ మేధావిగా ఎదిగిన అంబేదర్‌ జీవితం సదా ఆచరణీయమైనదని కొనియాడారు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన అంబేదర్‌ మూర్తిమత్వాన్ని విశ్వానికి చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. తెలంగాణ కొత్త సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఎంసెట్ శిక్షణ.. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష

దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేదర్‌ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్ఠిస్తున్నట్టు సీఎం తెలిపారు. అంబేదర్‌ ఆశయాలు, విలువలను అనుసరిస్తూ, దళిత బహుజన పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఆ మహానుభావునికి మనమిచ్చే అసలైన నివాళి అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. అదే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement