CM Revanth Reddy: హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం, అంతర్జాతీయ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం... ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలు హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి.

Telangana CM Revanth Reddy clarifies on Future City(X)

Hyd, Dec 4: హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం... ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలు హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి.

దేశంలో ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబయ్, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాలు వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు హైదరాబాద్ నగరానికి రాకుండా అభివృద్ధికి ఒక క్రమపద్ధతిలో బాటలు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను గమనించే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, నదికి పునరుజ్జీవం చేయాలని సంకల్పించాం. వరదలొస్తే నగరంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి వచ్చింది. అందుకే నగరంలో 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కడుతున్నాం అని వెల్లడించారు.

భవిష్యత్తరాలకు ఒక అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని అందించాలి. అప్పుడే నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా నిలబడుతుందన్నారు. మనం బాగుపడటానికి ఎవరో వస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదలతో ముంచెత్తుతుంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. నాలాల ఆక్రమణలను తొలగించాలి. మూసీని ప్రక్షాళన చేయాలి. పారిశ్రామిక కాలుష్యాలు మూసీలో కలవకుండా నియంత్రించాలన్నారు. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకున్న చోట ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే తెలంగాణకు మణిహారంగా 35 వేల కోట్ల రూపాయలను వెచ్చించి 360 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్డును చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించి రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు మధ్యన రేడియల్ రోడ్లు వేయడానికి 15 వేల కోట్ల రూపాయల వ్యయం చేయగలిగితే తద్వారా 60 శాతం తెలంగాణను అభివృద్ధి బాటన పడుతుందన్నారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి, తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూరగాయలు, ఫ్రూట్ మార్కెట్, డెయిరీ, పౌల్టీ, మీట్ ప్రాడక్ట్స్ సదుపాయాలు ఉంటాయి. వీటికి అనుబంధంగా కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తాం అన్నారు. ముచ్చర్ల ప్రాంతంలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించాం. 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2023 ఆరు నెల్లతో పోల్చితే 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2024 కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 29 శాతం పెరిగిందన్నారు.

రాజధాని హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలంటే మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి నుంచి నీటిని తరలింపు, మూసీ ప్రక్షాళన చేయకతప్పదు. ఈ ప్రాజెక్టులన్నింటికీ రాబోయే 4 సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు కావాలన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now