Telangana New Secretariat: 132 ఏళ్ల చరిత్ర గల భవనం కూల్చివేత, కొత్త సచివాలయ భవన నమూనాను విడుదల చేసిన తెలంగాణ సీఎంఓ
ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను (Telangana New Secretariat) ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనాలో భవనం ముందున్న నీటి కొలనులో తెలంగాణ సచివాలయ భవనం ప్రతిబింబిస్తోంది
Hyderabad, July 7: తెలంగాణ సచివాలయ భవన కూల్చివేత పనులు (Telangana Secretariat Building Demolition) ప్రారంభించిన ప్రభుత్వం నూతన భవన నమూనాను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను (Telangana New Secretariat) ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనాలో భవనం ముందున్న నీటి కొలనులో తెలంగాణ సచివాలయ భవనం ప్రతిబింబిస్తోంది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్, ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్నిచేపట్టనున్న తెలంగాణ ప్రభుత్వం
నూతన సచివాలయాన్ని (New Secretariat) నిర్మించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోర్టు కేసుల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా, పాత భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఉదయం భవనం కూల్చివేత పనులను ప్రభుత్వం (Telangana Govt) ప్రారంభించింది.
మంగళవారం ఉదయం నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయి. జేసీబీలు భవనాలను కూల్చివేస్తున్నాయి. సచివాలయం కూల్చివేస్తున్న నేపథ్యంలో పాత సచివాలయం వైపు వెళ్లే అన్ని రహదారులు మూసివేశారు. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, మింట్ కాపౌండ్ సెక్రెటరేట్ దారులను పోలీసులు మూసివేశారు.
Here's Netizens Tweet
అటు వైపు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు సచివాలయం బీఆర్కే భవన్‌ను క్లోజ్ చేశారు. ఎవరూ రావొద్దని సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు చేశారు. మరోవైపు కూల్చివేత పనులను సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Here's Telangana CM KCR foundation stone for the new Secretariat building in Hyderabad in 2019
132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సచివాలయం నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇది తొలి పాలనా కేంద్రమైంది. మొత్తం 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఈ సచివాలయం నిలిచింది. నిజాంలు 25 ఎకరాల విస్తీర్ణంలో 10లక్షల చదరపు అడుగుల్లో ఈ సచివాలయ కట్టడాన్ని నిర్మించారు. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సచివాలయాన్ని 10 బ్లాకులుగా నిర్మించారు.
అతిపురాతనమైన జీ బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మించింది. 2003లో డీ బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్‌లను ప్రభుత్వం ప్రారంభించింది. పాత సచివాలయాన్ని కూల్చివేసి అన్నీ హంగులతో నూతన సచివాలయం నిర్మాణంకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొత్తం 500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించనుంది. 6 లక్షల చదరపు అడుగుల్లో నూతన సచివాలయాన్ని నిర్మించి... సీఎం, అధికారులు, మంత్రుల సమావేశం కోసం అధునాతన హిల్స్ నిర్మించనుంది. మంత్రుల పేచీలోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ కార్యాలయాలతో నూతన సచివాలయం కట్టడానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది.