Congress MLC Jeevan Reddy: నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా?..కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహిరంగ లేఖ, పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ చెప్పిందెంటీ , జరుగుతుంది ఏంటని ప్రశ్న?
నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారో చెప్పాలన్నారు. తీవ్ర ఆందోళన మానసిక వ్యధ బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు జీవన్ రెడ్డి. తన రాజకీయ భవిష్యత్ ను మీరే నిర్దేశించండి అని కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగారు జీవన్ రెడ్డి.
Hyd, Oct 24: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్ కు సంచలన లేఖ రాశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారో చెప్పాలన్నారు. తీవ్ర ఆందోళన మానసిక వ్యధ బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు జీవన్ రెడ్డి. తన రాజకీయ భవిష్యత్ ను మీరే నిర్దేశించండి అని కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగారు జీవన్ రెడ్డి.
టీడీపీ నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభం అయ్యిందన్నారు. ఇందిరా గాంధీ మరణం తరువాత నేను కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యాను...40 ఏండ్లుగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నాను.. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు.పార్టీ మారాలంటూ BRS నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నేను పార్టీ వీడలేదు...నేను పార్టీ కోసం పని చేశాను.. BRS దౌర్జన్యాలను నేను మండలిలో ప్రశ్నించాను అన్నారు. కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన కేటీఆర్, డిచ్‌పల్లి బెటాలియన్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సమస్యను పరిష్కరించాలని వినతి
Here's Tweet:
ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ ఫిరాయిస్తున్నారో తెలవదు కానీ.. పార్టీ మారుతున్నారు...జగిత్యాల అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి.. అనే విధంగా ఒక తల్లి లాగా పార్టీని భావించాను అన్నారు. పదేండ్లు కాంగ్రెస్ కార్యకర్తల పై కేసులు పెట్టిన వాళ్లు... మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి పదవులు పొందుతున్నారు అన్నారు. పార్టీ మారిన నియోజక వర్గాల్లో.. పది మంది ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వం కొనసాగదా? చెప్పాలన్నారు.