Discount on Pending Traffic Challans Extended:వాహనదారులకు గుడ్ న్యూస్, పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ తేదీ పొడిగింపు, ఏప్రిల్ 14 వరకు ఛాన్స్, కీలక ప్రకటన చేసిన పోలీసులు
ఈ మేరకు ప్రకటన చేశారు. పాత నిబంధనల ప్రకారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వరకూ ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే.. ప్రజల్లో వస్తున్న విశేష స్పందనను చూసి, ప్రజలకు మరింత సౌలభ్యాన్ని కల్పించడం కోసం ఈ రాయితీ (Discount )గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది.
Hyderabad, March 31: వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు (Traffic Challans) ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులు. గతంలో ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన డిస్కౌంట్ తేదీని 15 రోజుల పాటూ పొడిగించారు (Date Extended). ఈ మేరకు ప్రకటన చేశారు. పాత నిబంధనల ప్రకారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వరకూ ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే.. ప్రజల్లో వస్తున్న విశేష స్పందనను చూసి, ప్రజలకు మరింత సౌలభ్యాన్ని కల్పించడం కోసం ఈ రాయితీ (Discount )గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ (Mahamood Ali)ప్రకటించారు.ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని హోమంత్రి తెలిపారు. వీటి విలువ 840 కోట్ల రూపాయలని ఆయన వెల్లడించారు.
ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందనీ, రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని మంత్రి తెలిపారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి పిలుపునిచ్చారు.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు గతంలో పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చారు. ముఖ్యంగా టూవీలర్, త్రీవీలర్లపై ఉన్న చలాన్లపై 75 శాతం మాఫీ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటూ ఆర్టీసీ డ్రైవర్లకు 70 శాతం, కార్లు, ఇతర ఫోర్ వీలర్లు, హెవీ వెహికిల్స్ కు 50 శాతం మాఫీ, తోపుడు బండ్ల వ్యాపారులకు 80 శాతం మాఫీ, నో మాస్క్ కేసులు రూ. 100 మాత్రం కడితే సరిపోతుంది. వాహనాలపై ఉన్న బకాయిలను ఆన్లైన్ సేవా చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లింపవచ్చు.