Telangana Elections 2024: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 61.59శాతం ఓటింగ్ నమోదు, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపిన సీఈఓ వికాస్ రాజ్

సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో వరకు 61.59శాతం నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్‌ పూర్తయిన చోట ఈవీఎంలను సిబ్బంది సీజ్‌ చేసి.. ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిస్తున్నారు.

VIkas Raj Telangana CEO

తెలంగాణలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో వరకు 61.59శాతం నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్‌ పూర్తయిన చోట ఈవీఎంలను సిబ్బంది సీజ్‌ చేసి.. ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. రాష్ట్రంలో పోలింగ్‌ శాతం బాగానే నమోదైందని.. ఓటింగ్‌ శాతం ఎక్కువగా నమోదైందన్నారు. తుది ఓటింగ్‌ శాతం ఎంత అనేది మంగళవారం వెల్లడిస్తానన్నారు.  నాలుగో దశ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటలకు 62 శాతం పోలింగ్ నమోదు, బెంగాల్‌లో అత్యధికంగా 76 శాతంపైగా పోలింగ్

106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్‌ జరిగిందన్నారు. 1400 పోలింగ్‌ కేంద్రాల దగ్గర క్యూలో ఓటర్లు ఉ న్నారన్నారు. సోమవారం 400 ఫిర్యాదులు వచ్చాయని.. 200పైగా సీ విజిల్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించామన్నారు. 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాదయన్నారు. ఈవీఎంలను భద్రపరించేందుకు రాష్ట్రంలో 44 స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జీపీఎస్‌ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలు తరలిస్తామన్నారు. ఈవీఎంల తరలింపు అర్ధరాత్రి వరకు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.