Telangana Elections 2024: తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ, 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం, పీఏసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

ఐదు అంశాలే ఎజెండాగా ఈ సమావేశం కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ (PAC) కృతజ్ఞతలు తెలిపింది.

Sonia Gandhi during public meeting in Hubbali on May 6 (File Photo/ANI)

Hyd, Dec 18: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఐదు అంశాలే ఎజెండాగా ఈ సమావేశం కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ (PAC) కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి వచ్చే ఎన్నికల్లో (Telangana Elections 2024) పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ఏకగ్రీవ తీర్మానం చేసింది. పీఏసీ సమావేశ నిర్ణయాలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ వెల్లడించారు.

ప్రగతిభవన్ ఇనుపకంచెను బద్దలుకొట్టాం.. ప్రగతిభవన్‌లోకి 4 కోట్ల మందికి అవకాశం కల్పించాం, పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా : సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం

పీఏసీ ‍కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశాం. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తాం. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్‌ ఇస్తారు. నాగ్‌పుర్‌లో ఈ నెల 28న జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్రం నుంచి 50వేల మందిని తరలిస్తామన్నారు.

ఇక, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్ట్‌ల అవకతవకలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రాజెక్ట్‌ల్లో ఏం జరిగిందో ఆయన వివరిస్తారు. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తాం. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని తీర్మానం చేశాం. గతంలో ఇందిరా గాంధీ కూడా మెదక్‌ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు.

మళ్లీ విధుల్లోకి మాజీ డీఎస్పీ నళిని, పోలీస్ శాఖలో వీలుకాకపోతే వేరేశాఖలో జాబ్ ఇవ్వాలంటూ సీఎం రేవంత్ నిర్ణయం

రేషన్ కార్డులు, ఇళ్ల విషయంలో త్వరలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. పార్లమెంట్ స్థానాలకు మంత్రులను ఇన్‌ఛార్జిలను నియమించామన్నారు. నామినేటెడ్‌ పోస్టులను నెల లోపు భర్తీ చేయాలని పీఏసీలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన నాయకులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ఆ పార్టీ నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఇన్‌ఛార్జిలుగా నియమితులైన వారిలో ముఖ్యమంత్రితోపాటు దాదాపు అందరూ మంత్రులే ఉన్నారు.

తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలు వీళ్లే..

చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ - రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ - భట్టి విక్రమార్క

నాగర్‌కర్నూల్‌ - జూపల్లి కృష్ణారావు

నల్గొండ - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

భువనగిరి - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

వరంగల్‌ - కొండా సురేఖ

మహబూబాబాద్‌, ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

ఆదిలాబాద్‌ - సీతక్క

పెద్దపల్లి - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కరీంనగర్‌ - పొన్నం ప్రభాకర్‌

నిజామాబాద్‌ - జీవన్‌ రెడ్డి

జహీరాబాద్‌ - పి.సుదర్శన్‌రెడ్డి

మెదక్‌ - దామోదర రాజనర్సింహ

మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif