హైదరాబాద్: నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ వాగ్యుద్ధానికి దిగారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రగతిభవన్‌లోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని, ప్రగతిభవన్ ముందు గద్దర్ గంటల తరబడి నిరీక్షించినా లోనికి అనుమతించలేదు.. మేం వచ్చిన వెంటనే ప్రగతిభవన్ ఇనుపకంచెను బద్దలుకొట్టాం.. ప్రగతిభవన్‌లోకి 4 కోట్ల మందికి అవకాశం కల్పించాం.. మాది ప్రజా ప్రభుత్వం.. పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ధ్వజం ఎత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణ తీర్పు.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు.. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచారు.. బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారు.. వాళ్లు ఇలానే ఉంటే వారిని ఎక్కడికి పంపించాలో ప్రజలకు తెలుసు.. గడీలు బద్దలుకొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్‌ఎస్ నేతలు భరించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీ: ఎల్బీ స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణం చేస్తున్న సమయంలోనే.. తెలంగాణ ప్రజలకు నిషేధిత ప్రాంతమని, ప్రవేశమే లేదని భావించి నిర్మించిన ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టించి నాలుగు కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
: ముఖ్యమంత్రి శ్రీ… pic.twitter.com/3aNakL9RsH
— Telangana Congress (@INCTelangana) December 16, 2023