Telangana Elections 2024: ప్రధాని మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే, మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారని మండిపడిన తెలంగాణ ముఖ్యమంత్రి
వరంగల్‌లో బుధవారం(ఏప్రిల్24) జరిగిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు.
Hyd, April 24: తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయని CM రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో బుధవారం(ఏప్రిల్24) జరిగిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలేనని, కేసీఆర్ రాష్ట్రాన్ని ఢిల్లీలో మోదీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘మామా, అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారు. ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
అసెంబ్లీలో మా కళ్లలో చూసే ధైర్యం లేక కేసీఆర్ పారిపోయాడు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు. మాతో చర్చకు రమ్మంటే పారిపోతాడు. కేసీఆర్ చచ్చిన పాము. కాళేశ్వరం అద్భుతంగా కట్టి ఉంటే కేసీఆర్ నాతో చర్చకు రావాలి. ప్రాజెక్టు వద్దే చర్చకు రావాలి. బీఆర్‌ఎస్, బీజేపీ నాణానికి బొమ్మ బొరుసు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఓడించాలి. బీజేపీ నేతలకు మతపిచ్చి పట్టుకుంది. మోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో బీజేపీ నేతలు చెప్పాలి. వరంగల్‌లో ఆరూరి రమేష్‌కు ఓటేస్తే అనకొండై మీ భూములు మింగేస్తాడు. చేయి గుర్తుకు ఓటేసి కడియం కావ్యను గెలిపించాలి’అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.