Telangana Cabinet Meeting: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, కొత్త చట్టం తీసుకువచ్చేందుకు కసరత్తు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖంగా రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా కొత్త చట్టం తీసుకురావాలని టీ కేబినెట్ (Telangana Cabinet Meeting) నిర్ణయించింది.

CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

Hyd, Jan 17: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖంగా రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా కొత్త చట్టం తీసుకురావాలని టీ కేబినెట్ (Telangana Cabinet Meeting) నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన, ప్రైవేట్‌ స్కూల్స్‌, జూ.కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ.. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన...మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

తెలంగాణలో కొత్తగా 2,447 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు

పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ...‘‘మన ఊరు – మన బడి’’ ప్రణాళిక కోసం కేబినెట్ (Telangana Cabinet) ఆమోదం తెలిపింది. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తోంది. దీంతో పాటు వానాకాలం ధాన్యం కొనుగోలుపైనా చర్చించిన తెలంగాణ కేబినెట్‌ భేటీ సాగినట్లు తెలుస్తోంది. ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు సమాచారం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement