COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,447 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు
Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

Hyd, Jan 17: తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 80,138 శాంపిల్స్ పరీక్షించగా... 2,447 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 235, రంగారెడ్డి జిల్లాలో 183 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 2,295 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,060కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,11,656 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,85,399 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,197 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వేలాది మంది కరోనా పేషెంట్లు గాంధీలో చికిత్స పొంది ప్రాణాలను నిలుపుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పేషెంట్లను కాపాడారు.

ఇప్పుడు ఆ ఆసుపత్రి వైద్యుల పైనే కరోనా పంజా విసిరింది. ఏకంగా 120 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నారు. ఒక్కసారిగా ఈ స్థాయిలో వైద్యులు కరోనా బారిన పడటంతో ఇతర సిబ్బందిలో తీవ్ర ఆందోళన మొదలైంది. మరికొందరు సిబ్బందికి చెందిన కోవిడ్ రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.