Telangana: పండగ సంబరాల వేళ తీవ్ర విషాదం, ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో నలుగురు యువకులు మృతి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కోటిపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆ ప్రాజెక్టులో తీవ్రంగా గాలించి ఆ నలుగురు యువకుల మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

HYD. Jan 16: తెలంగాణ వికారాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోటిపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆ ప్రాజెక్టులో తీవ్రంగా గాలించి ఆ నలుగురు యువకుల మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మృతులంతా మన్నెగూడ వాసులుగా గుర్తించారు. ఐతే అదికారులు ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

నేపాల్ విమానం మంటల్లో బూడిదయ్యే సెకన్ల ముందు వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భారతీయ ప్రయాణికుడు తీసిన వీడియో

ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. పండగ రోజు సరదాగా గడిపేందుకు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఒడ్డున ఈదుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు గుర్తించి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేశ్, జగదీశ్, వెంకటేశ్‌, రాజేశ్‌లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.