Discounts on Traffic E-Challans: భారీగా పెండింగ్ చలానాలు ఉన్నాయా.. ఏం పర్లేదు, ఈ నెలాఖరు వరకు 75 శాతం డిస్కౌంట్‌తో కట్టేయండి, వాహనదారులకు బంపరాఫర్ ప్రకటించిన తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ
మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు వాహనాదారులు పెండింగ్‌లో ఉన్న చలానాల మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లిస్తే (Discounts on Ttraffic E-Challans) సరిపోతుంది. అంటే 75శాతం రాయితీ (Pending Challans from March 1) ఉంటుంది.
Hyd, Mar 1: తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు మార్చి నెలల శుభవార్తను అందించారు. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు వాహనాదారులు పెండింగ్‌లో ఉన్న చలానాల మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లిస్తే (Discounts on Ttraffic E-Challans) సరిపోతుంది. అంటే 75శాతం రాయితీ (Pending Challans from March 1) ఉంటుంది.
ఉదాహరణకు.. ఓ ద్విచక్ర వాహనదారునికి వివిధ ఉల్లంఘనల కింద రూ.20వేల చలనాలు ఉంటే ఆ మొత్తానికి రాయితీలో భాగంగా రూ.5000 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అలాగే సర్వీస్ చార్జి కింద వసూలు చేసే రూ. 35ను కూడా రాయితీలో భాగంగా పరిగణిస్తారు. ఫోర్ వీలర్ వాహనాలకు 50 శాతం రాయితీ ప్రకటించారు. అదే విధంగా ఉల్లంఘనుల్లో ఆర్టీసీ బస్ డ్రైవర్లు కూడా ఉన్నందున… వారికి 70శాతం రాయితీ ప్రకటించారు. వీళ్లు 30 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
మాస్క్‌లేకుండా రోడ్లపై తిరిగే వారికి పోలీసులు రూ.1000 జరిమానా విధించిన సంగతి విదితమే వారికి కూడా భారీ రాయితీ (TS Traffic Challan Discount) కల్పించారు. వారు 90 రాయితీ పోనూ కేవలం 10శాతంతో పెనాల్టీ చెల్లించవచ్చని ప్రకటించారు. రూ.1000 జరిమానా ఉంటే కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఇక వాహనదారులు పెండింగ్‌లో ఉన్న చలనాలను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. అంతేగాకుండా రోడ్లపైకి తోపుడు బండ్లను తీసుకొచ్చి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి 80 శాతం రాయితీ ప్రకటించారు.
ఈ రాయితీలు ప్రకటించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా జమ అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బంపర్ ఆఫర్ మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 కోట్లకుపైగా పెండింగ్ చలనాలు ఉన్నట్లు పోలీసు శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా రాయితీలతో ఎంతోకాలంగా చలానాలు చెల్లించకుండా వేచి చూస్తున్న వాహనదారులకూ ఓ అవకాశం కల్పించినట్లు అవుతుంది.
పెండింగ్ చలానాలు ఎలా చెల్లించాలంటే..
పెండింగ్ చలానాలున్న వాహనదారులు తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో వాహనం నంబరు ఎంటర్ చేయగానే పెండింగ్ ట్రాఫిక్ చలానాల వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. పెండింగ్ చలానాల సంఖ్య, మొత్తం జరిమానాతోపాటు తాజా రాయితీ తర్వాత ఎంత చెల్లించాలనే వివరాలన్నీ కనిపిస్తాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే తదితర డిజిటల్ వాలెట్‌లతో పాటు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.