Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు, జేఈఈ మెయిన్స్ కారణంగా మారిన తేదీలు, ఇంటర్ బోర్డు కొత్తగా రీ షెడ్యూల్ చేసిన తేదీలు ఇవే!

ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలనుకున్నారు. కానీ జేఈఈ పరీక్షల కారణంగా ఎగ్జామ్స్ ను రెండు రోజులు వెనక్కు మార్చారు.

Representational Image (Photo Credit: PTI)

Hyderabad, March 03: తెలంగాణ ఇంటర్ పరీక్షలను రీ షెడ్యూల్ (schedule revised) చేశారు అధికారులు. జేఈఈ మెయిన్స్(JEE Mains) పరీక్షలకు ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో తెలంగాణలో ఇంటర్ పరీక్షల (Telangana Inter Exams) షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలనుకున్నారు. కానీ జేఈఈ పరీక్షల కారణంగా ఎగ్జామ్స్ ను రెండు రోజులు వెనక్కు మార్చారు. రీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. రీ షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.

TSRTC: వీసీ స‌జ్జ‌నార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం, హైద‌రాబాద్ సిటీలో ఉచితంగా ప్ర‌యాణం, 250 కిలోమీట‌ర్ల పైన టికెట్ బుక్ చేసుకున్న వారికి తీపి కబురు చెప్పిన టీఎస్ఆర్టీసీ

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు

(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు)

22-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-I

25-04-2022 : ఇంగ్లీష్ పేపర్-I

27-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I

29-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I

02-05-2022 : ఫిజిక్స్ పేపర్-I, అర్థశాస్త్రం పేపర్-I

06-05-2022 : కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ -I

09-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)

11-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I

GST Collections in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ, తెలంగాణలో రూ.4,113 కోట్ల జీఎస్టీ

ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు

(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)

23-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-II

26-04-2022 : ఇంగ్లీష్ పేపర్-II

28-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II

30-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II

05-04-2022 : ఫిజిక్స్ పేపర్-II, అర్థశాస్త్రం పేపర్-II

07-05-2022 : కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II

10-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)

12-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif