Telangana: ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజే విద్యార్థిని ఆత్మహత్య, హన్మకొండలో హాస్టల్‌లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న ఇంటర్ స్టూడెంట్ నాగజ్యోతి
తాజాగా వరంగలో జిల్లాలో హన్మకొండలో ( Hanamkonda) ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది.
Hanamkonda, Mar 16: తెలంగాణలో వరుసగా విద్యార్థిని ఆత్మహత్యల వార్తలు కలవరం రేపుతున్నాయి. తాజాగా వరంగలో జిల్లాలో హన్మకొండలో ( Hanamkonda) ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. నగరంలోని సువిద్యా జూనియర్ కళాశాలకు చెందిన ఫస్టియర్ విద్యార్థిని నాగజ్యోతి ఉరివేసుకుని ఆత్మహత్య (Inter student commits suicide) చేసుకుంది. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ నిన్న జరిగిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సరిగా రాయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన నాగజ్యోతి కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. నిన్న పరీక్ష రాసి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని రాత్రి ఉరి వేసుకుంది. వెంటనే తోటి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
పేరెంట్స్ వస్తే గాని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని ఆత్మహత్యతో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు.