TS Inter Exams 2024: ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి నో ఎంట్రీ, ఈ నెల 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు.

Representational Image (File Photo)

ఈ నెల 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కోసం 1,521 సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 27,900 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు.

పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు.. మెరుగైన స్కోరును ఎంపిక చేసుకునే అవకాశం.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుతుందని శృతి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోనే నీరు, వైద్య సదుపాయాలు ఉంటాయని చెప్పారు.

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif