Telangana: కూతుర్ల దినోత్సవం రోజే తల్లిదండ్రులకు శోకం, గోవాలో గుండెపోటుతో మృతి చెందిన మంచిర్యాల వైద్యురాలు, ఆమె పుట్టిన రోజు నాడే ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిన కుటుంబం

కూతుర్ల దినోత్సవం (Dauhters Day) రోజునే ఓ కూతురు తన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతూ తిరిగిరాని లోకాలకు (Mancherial Female doctor Dies) వెళ్లిపోయింది. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.

Representational Image (Photo Credits: ANI)

Hyd, Sep 27: తెలంగాణ మంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కూతుర్ల దినోత్సవం (Dauhters Day) రోజునే ఓ కూతురు తన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతూ తిరిగిరాని లోకాలకు (Mancherial Female doctor Dies) వెళ్లిపోయింది. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.

స్థానికులు, బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జయ మెటర్నిటీ నర్సింగ్‌ హోం వైద్యులు డాక్టర్‌ ఫణికుమార్‌–జయలలిత దంపతులకు ఒక్కగానొక్క కూతురు నేహ(24). గతేడాది ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్‌ అవుతోంది. ఈ క్రమంలో బంధువులతో కలిసి రెండు రోజుల క్రితం గోవా వెళ్లింది. శనివారం అర్ధరాత్రి కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరుపుకుంది. అనంతరం తల్లిదండ్రులతో ఫోన్లో ఆనందాన్ని పంచుకుంది. ఈ క్రమంలో తెల్లవారేసరికే గుండెపోటుతో మృతి (Female doctor dies of heart Attack in Goa ) చెందిన వార్త కన్నవారిలో తీరని శోకం మిగిల్చింది.

పెళ్లయిన నెలకే భార్య గొంతు కోసి చంపేసిన కసాయి భర్త, అనంతరం ఆత్మహత్యా ప్రయత్నం, హైదరాబాద్ ప్రగతినగర్‌లో దారుణ ఘటన

అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను విడిచి ఇప్పటి వరకు నేహ పుట్టినరోజు జరుపుకోలేదు. ఎప్పడూ అడగని బిడ్డ డాడీ.. ఈ సారి గోవాలో బర్త్‌డే జరుపుకుంటానని అడిగితే తండ్రి కాదనలేక పంపించినట్లు బంధువులు తెలిపారు. కూతురు మరణవార్త విన్న తండ్రి డాక్టర్‌ ఫణికుమార్, కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌ బయలు దేరారు. గోవా నుంచి మృతదేహం హైదరాబాద్‌ రానున్నట్లు తెలిసింది. డాక్టర్‌ ఫణికుమార్‌–జయలలిత కూతురు మరణవార్త తెలియడంతో బంధువులు, మిత్రులు వారింటికి చేరుకున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.