
Hyd, Sep 26: పెళ్లయి నెల కూడా కాలేదు. అప్పుడే భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తాయి. ఇవి తారాస్థాయిక చేరడంతో భార్యను గొంతు కోసి భర్త అతి కిరాతకంగా హత్య (Man kills wife over suspicion of affairs) చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతినగర్‌కు చెందిన కిరణ్‌కు సుధారాణి (22) అనే యువతితో నెల రోజుల క్రితమే వివాహమైంది.పెళ్లి తర్వాత భార్య మీద అనుమానం పెంచుకున్న కిరణ్ శనివారం అర్ధరాత్రి సమయంలో ఆమెను గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశాడు.
అనంతరం తానూ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని సుధారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన కిరణ్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సుధారాణిని మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.