Telangana: తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది, రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని తెలిపిన మంత్రి హరీష్ రావు
తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Hyd, May 10: మహబూబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని.. తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు (Minister Harish Rao lays foundation stone) చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి (Mahbubabad district Medical hospital) శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట సత్తా చాటింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ అన్నారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లాయే లేదు. మెడికల్ కాలేజీ లేదు. 65 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే, ఏడేండ్లలో వాటిని 33కు పెంచుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు రండి. నాణ్యమైన ఉచిత సేవలు వినియోగించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రకృతి పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ వికృతి పార్టీలని విమర్శించారు. టీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ. ప్రజల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు.