IPL Auction 2025 Live

Kavita Nirasana Deeksha: జంతర్‌మంతర్‌లో ఉదయం 10 గంటలకు కవిత నిరసన దీక్ష షురూ.. ప్రారంభించనున్న సీతారాం ఏచూరి.. పూర్తి వివరాలు.. వీడియోతో

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది.

Kalvakuntla Kavitha | File Image

New Delhi, March 10: భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ (Telangana MLC) కల్వకుంట్ల కవిత (Kavita) ఇవాళ ఢిల్లీలోని (Delhi) జంతర్‌మంతర్‌లో (Jantar mantar) నిరసన దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. ఎమ్మెల్సీ కవితతోపాటు దాదాపు 500 మంది దీక్షకు కూర్చునే అవకాశం ఉన్నది. మొత్తంగా అన్ని రాష్ర్టాల నుంచి సుమారు ఆరు వేల మంది వరకు హాజరవుతారన్న అంచనా మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. దేశంలోని మహిళా హక్కుల సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఈ దీక్షకు హాజరుకానున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉదయం 10 గంటలకు దీక్షను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు దీక్ష సీపీఐ కార్యదర్శి డీ రాజా దీక్షను ముగించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, మనిష్‌ సిసోడియా మళ్లీ అరెస్ట్, ఈ సారి అరెస్ట్ చేసింది ఈడీ, నేడు కోర్టులో విచారణకు రానున్న సిసోడియా బెయల్ పిటిషన్

రాష్ట్రం నుంచి మంత్రులు కూడా..

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత, నామా నాగేశ్వర్‌రావు, కే కేశవరావు, వెంకటేశ్‌ నేత, వద్దిరాజు రవిచంద్ర, సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రేఖానాయక్‌ తదితరులు ఢిల్లీకి వెళ్లారు.

 

దీక్ష లక్ష్యం ఏమిటంటే?

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఆమోదింపజేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి తరఫున కవిత ఒక్క రోజు దీక్ష తలపెట్టారు.

సభాస్థలిపై హైడ్రామా..

ఎమ్మెల్సీ కవిత దీక్షపై చివరి వరకూ హైడ్రామా నడిచింది. జంతర్ మంతర్ లో శుక్రవారం సభ నిర్వహించేందుకు భారత జాగృతి గతంలోనే దరఖాస్తు చేసుకోగా, పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం ఆ స్థలంలో అదే సమయంలో బీజేపీ దీక్ష ఉన్నదంటూ చెప్పారు. దీక్షను వేరే మైదానానికి వాయిదా వేసుకోవాలని ఒకసారి, జంతర్‌మంతర్‌లోనే సగం స్థలంలో సర్దుకోవాలని, మిగతా స్థలాన్ని బీజేపీకి ఇవ్వాలని మరోసారి సూచించారు. దీంతో భారత జాగృతి సభ్యులు పోలీసు అధికారులతో సంప్రదింపులు జరిపారు. చివరికి ఢిల్లీ పోలీసులు దీక్షకు అనుమతి ఇచ్చారు.