Man Brutally Murdered: కరీంనగర్‌లో యువకుడిని గొడ్డలితో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, ప్రేమ వ్యవహారమే కారణమా? కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు

అత్యంత కిరాతంగా గొడ్డలితో గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడిని నరికి (karimnagar man murder) చంపారు. అయితే దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని వార్తలు వస్తున్నాయి.‌ స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ప్రణయ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన దళిత అమ్మాయి 8ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Hyderabad, Oct 20: కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు (Man Brutally Murdered) గురయ్యాడు. అత్యంత కిరాతంగా గొడ్డలితో గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడిని నరికి (karimnagar man murder) చంపారు. అయితే దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని వార్తలు వస్తున్నాయి.‌ స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ప్రణయ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన దళిత అమ్మాయి 8ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు.

అయితే వీరిద్దరి ప్రేమ విషయంలో ఇరు కుటుంబాల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రణయ్‌పై అర్థరాత్రి ఆయన ఇంటివద్దనే దాడి చేశారు. యువకుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్ వద్ద నరికి చంపారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుకున్న సీపీ కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారంతోనే హత్య చేసినట్లు భావిస్తూ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. త్వరలో నిందితులను గుర్తించి పట్టుకుంటామని ప్రకటించారు.

ప్రేమించుకున్నారు, పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నారు, నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం బిల్లకల్‌ అటవీ ప్రాంతంలో విషాద ఘటన

దళితుడైన ప్రణయ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ప్రణయ్‌ హత్య పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపింది. మరోవైపు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రాత్రి సయమంలో అమ్మాయి ఫోన్ చేస్తేనే ప్రణయ్‌ బయటకు వెళ్లాడని, ఆమెతో మాట్లాడుతుండగా యువతి సోదరుడు అనిల్ కర్రలతో దాడి చేయడంతో చనిపోయినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా ప్రణయ్ మృతదేహాన్ని అంబేద్కర్ భవన్ వద్ద పడేసినట్లు వారు తెలిపారు. అమ్మాయి అబ్బాయి 8 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారని, వారి ప్రేమ వ్యవహారం అమ్మాయి కుటుంబ సభ్యులందరికీ తెలుసునని తెలిపారు. అమ్మాయి సోదరుడు అనీల్ ఒక్కరికి మాత్రమే నచ్చకపోవడంతో పలుమార్లు గొడవ జరిగినట్లు తెలిపారు. పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌