Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమిదే! (వీడియోతో)
మరో వారంలో ప్రారంభించాలనుకొన్న తెలంగాణ నూతన సచివాలయం (Telangana New Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ (Election Code) కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Hyderabad, Feb 11: మరో వారంలో ప్రారంభించాలనుకొన్న తెలంగాణ నూతన సచివాలయం (Telangana New Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ (CM KCR) పుట్టినరోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ నిర్మాణాన్ని రాకెట్ వేగంతో పూర్తి చేస్తున్నది. అయితే ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రానే వచ్చేసింది.
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రారంభోత్సవానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.