Telangana Police Recruitment: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
Hyd, May 20: తెలంగాణ సర్కార్ తాజాగా మరో గుడ్‌న్యూస్ అందించింది. పోలీసుశాఖ నియామకాల్లో (Telangana Police Recruitment) అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు (KCR Govt Increases Upper Age Limit) తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్, నేడు ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశం
కాగా పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 2వ తేదీ నుండి పోలీస్ ఉద్యోగాల కోసం ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 20 రాత్రి 10 గంటల వరకు మాత్రమే సమయముంది. అయితే వయోపరిమితి పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువు తేదీని కూడా పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.