Telangana Shocker: తల్లి నగ్నఫోటోలతో ముగ్గురితో కామవాంఛను తీర్చుకున్న కామాంధుడు, అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన, నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2.60 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చిన ఆదిలాబాద్‌ కోర్టు

ఒక మహిళకు తెలియకుండా ఆమె నగ్నఫోటోలు తీసి ఆపై లైంగిక దాడికి (man molested three women) పాల్పడ్డాడు. అవే ఫోటోలను ఆమె కుమార్తెకు చూపించి కూతురితో కామవాంఛ తీర్చుకున్నాడు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Hyderabad, Mar 9: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు తెలియకుండా ఆమె నగ్నఫోటోలు తీసి ఆపై లైంగిక దాడికి (man molested three women) పాల్పడ్డాడు. అవే ఫోటోలను ఆమె కుమార్తెకు చూపించి కూతురితో కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత అదే ఇంట్లో పని చేసే పనిమనిషినీ వదిలిపెట్టలేదు. ఆమెపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుల్లో ఒకరైన పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ముద్దాయిగా తేలిన కామాంధుడికి జీవితకారాగార శిక్షను కోర్టు విధించింది. అలాగే, 2.60 లక్షల అపరాధం కూడా విధించింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బెల్లంపల్లిలో ఓ ఇంట్లో పనిచేసే మహిళతో షేక్‌ అన్వర్‌ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. రోజూ ఆమెను కలవడానికి వెళ్లే క్రమంలో ఒకరోజు ఆ ఇంటి యజమానురాలు దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా ఫొటోలు తీశాడు. ఈ ఫోటోలు ఆమెకు చూపించి కామవాంఛ తీర్చుకున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో కొడుకును చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన 2017లో జరిగింది.

పోలీస్ స్టేషన్‌లోనే మహిళపై 3 రోజుల పాటు ఎస్సై అత్యాచారం, రాజస్థాన్‌లో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపిన అల్వార్ ఎస్పీ

ఆ తర్వాత ఆమె కుమార్తెపై కన్నేశాడు. 9వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెకు తల్లి నగ్నఫొటోలు చూపించి, సోషల్‌ మీడియాలో పెడతానని భయపెట్టి బాలికపైన కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. వీరిద్దరిపైనే కాకుండా ముందు పరిచయమైన పని మనిషిపైన కూడా అన్వర్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు బెల్లంపల్లి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి సీఐ నాగరాజు చార్జ్‌షీట్‌ వేశారు.

విచారణలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శ్రీరామ్‌ 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. ముగ్గురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ముద్దాయికి జీవిత ఖైదుతో (lifetime prisonment) పాటు రూ.2.60 లక్షల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా మహిళా జడ్జి, ఉమ్మడి 6వ కోర్టు జడ్జి వై.జయప్రసాద్‌ సోమవారం తీర్పుచెప్పారు.