Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 81వేల ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో రిక్రూట్‌మెంట్‌, 2023 సంవత్సరాన్ని ఉద్యోగ తెలంగాణగా ప్రభుత్వం మార్చిందని తెలిపిన మంత్రి హరీష్ రావు

2023 సంవత్సరాన్ని ఉద్యోగ తెలంగాణగా ప్రభుత్వం మార్చిందని అన్నారు. గురువారం రూ. 20 కోట్లతో అప్‌గ్రేడ్‌ చేసిన వంద పడకల ఆస్పత్రికి మంత్రి శంకుస్థాపన చేశారు

Health and Medical Minister Harish Rao (Photo-Twitter)

Hyd, Jan 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 81వేల ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లు (Recruitment notifications) జారీ చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 2023 సంవత్సరాన్ని ఉద్యోగ తెలంగాణగా ప్రభుత్వం మార్చిందని అన్నారు. గురువారం రూ. 20 కోట్లతో అప్‌గ్రేడ్‌ చేసిన వంద పడకల ఆస్పత్రికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన (Health and Medical Minister Harish Rao) మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఒక్క వైద్య ఆరోగ్య శాఖ లో 6,431 డాక్టర్ పోస్టులు, 7600 స్టాఫ్ నర్స్ లు, 5192 పారా మెడికల్ సిబ్బంది.1900 మంది ఇతర సిబ్బంది మొత్తం 21,200 మందిని కొత్తగా (81 thousand government jobs) నియమించామని అన్నారు.

ఏపీలో త్వరలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న కేసీఆర్.. సభ‌ ఎక్కడ నిర్వహించేదీ త్వరలోనే ప్రకటన

దేశంలో కేంద్ర ప్రభుత్వ హయాంలో 6 శాతం ఉన్న నిరుద్యోగం 8.3 శాతానికి పెరిగిందని వివరించారు. తెలంగాణ లో 4.1 మాత్రమే నిరుద్యోగిత రేటు ఉందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ లో మూడే డయాలసిస్ సెంటర్లు ఉండగా ఇపుడు 122 చేశామని అన్నారు.ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం కు ఒక డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ లో 200 ఉన్న ఐసీయూ బెడ్ లను 6వేలకు పెంచామని గుర్తు చేశారు.

పండగకు ఏపీకి వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతికి 10 లహరి స్లీపర్‌ బస్సులు నడుపుతున్నట్లు ప్రకటన, ప్రతి బస్సుకు ఎయిర్‌ సస్పెన్షన్‌ సదుపాయం

తెలంగాణ లో 950 మంది డాక్టర్లను కొత్తగా నియమించగా ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 90 మంది డాక్టర్లను నియమించామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ వైద్య ఆరోగ్య శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చి , నిధులను పెంచి పేదలకు ఆరోగ్యం ను చేరువ చేశారని కొనియాడారు. హెల్త్ సెక్టార్ లో తెలంగాణ బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ అని కేంద్ర ప్రభుత్వ మే తేల్చిందని పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక వైద్య ఆరోగ్య శాఖ ముఖ చిత్రం మారిందని అన్నారు. హజీపురలో బస్తీ దవాఖానాను , కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించగా స్థానిక శాసన సభ్యులు విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ జి రవి తదితరులు పాల్గొన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif