Sleeper Special buses (Photo-Video Grab)

Hyd, Jan 5: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్‌ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం సొంతూర్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరవాసులు సిటీ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ (sankranti festival) కోసం తెలంగాణ ఆర్టీసీ సైతం రెడీ అయ్యింది.

ఈ ఏడాది పండుగ కోసం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను (sleeper special buses From Hyderabad to ap) సిద్ధం చేసింది. పండుగకు ముందే స్లీపర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించనుంది. ప్రయాణికులను ఆకర్షించే విధంగా లహరి నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను సిద్ధం చేసింది. సంక్రాంతికి 10 లహరి స్లీపర్‌ బస్సులను హైదరాబాద్‌ నుండి కాకినాడ, విజయవాడకు నడుపనుంది. ఈ బస్సుల్లో మాములు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న విధంగానే సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (MD Sajjanar) స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను మేకింగ్‌ చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో అమ్మాయి కోసం వెతికి అడ్డంగా బుక్కయిక టెకీ, ఛాటింగ్ మాయమాటలతో రూ. 2 లక్షలు పిండిన కిలాడీలు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తిన బాధితుడు

త్వరలో టీఎస్ఆర్టీసీ సంస్థలోకి 550 వరకు ఎలక్ట్రిక్‌ బస్సులు రాబోతున్నాయని టీఎస్‌ఆర్టీసీ సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ చెప్పారు. సంస్థలో తొలిసారిగా 10 స్లీపర్‌ నాన్‌ ఏసీ బస్సులను బుధవారం హైదరాబాద్‌లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. బస్సుల లోపల సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం బాజిరెడ్డి, సజ్జనార్‌ మాట్లాడుతూ.. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే అమ్మ ఒడిలాంటి అనుభూతి కలుగుతుందని, అందుకే వీటికి లహరి అని నామకరణం చేసినట్టు చెప్పారు. త్వరలో మరో 16 ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌ రావు థాకరే, ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించిన అధిష్ఠానం

బెంగళూరు హుబ్లీ, విజయవాడ, వైజాగ్‌ తదితర నగరాలకు ఏసీ స్లీపర్‌ బస్సులు నడుపుతామని చెప్పారు. బుధవారం ప్రారంభించిన నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు తొలుత హైదరాబాద్‌-కాకినాడ, హైదరాబాద్‌-విజయవాడ మార్గాల్లో అద్దె ప్రాతిపదికన నడుపుతారు. కాకినాడ వెళ్లే స్లీపర్‌ బస్సులు హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ నుంచి బయలుదేరతాయి. కార్యక్రమంలో ఆర్టీసీ సీవోవో డాక్టర్‌ రవీందర్‌, ఈడీలు వినోద్‌కుమార్‌, యాదగిరి, పురుషోత్తం, మునిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో త్వరలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న కేసీఆర్.. సభ‌ ఎక్కడ నిర్వహించేదీ త్వరలోనే ప్రకటన

స్లీపర్‌ బస్సుల్లో 15 లోయర్‌ బెర్తులు, 15 అప్పర్‌ బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్‌ వద్ద వాటర్‌ బాటిల్‌తోపాటు మొబైల్‌ చార్జింగ్‌ పెట్టుకొనే సౌకర్యం ఉంటుంది. సీటర్‌ కమ్‌ స్లీపర్‌ బస్సుల్లో 15 అప్పర్‌ బెర్తులతోపాటు లోయర్‌ లెవెల్‌లో 33 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రతి బస్సుకు ఎయిర్‌ సస్పెన్షన్‌ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సులో వైఫై ఉంటుంది. ప్రయాణికులకు ఉచిత వాటర్‌ బాటిల్‌, ఫ్రెషనర్లను అందించడంతోపాటు లగేజీ లోడింగ్‌ అన్‌ లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా విశాలంగా బెర్తులు ఏర్పాటు చేశారు.