Cybercrime (Photo Credits: IANS)

Hyd, Jan 5: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కాల్‌గర్ల్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికిన ఓ సాఫ్ట్ వేర్ అడ్డంగా బుక్కయ్యాడు. అమ్మాయి అనుకుని వారి మాయమాటలకు మోసపోయి.. రెండు లక్షల దాకా డబ్బును పోగొట్టుకున్నాడు. చందానగర్‌లో స్థానికంగా నివాసం ఉండే సదరు వ్యక్తి.. డిసెంబరు చివరివారంలో ఆన్‌లైన్‌లో ఎస్కార్ట్‌ సర్వీస్‌ (escort services) ద్వారా కాల్‌గర్ల్‌ (Call Girl) కోసం వెతికాడు. ఓ వెబ్‌సైట్లో కనిపించిన లింకు క్లిక్‌ చేయగానే ఒక నెంబర్‌ దొరికింది.

ముఖేష్ అంబానీ కొడుకునంటూ మహిళతో ఛాటింగ్, నగ్న ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్, రూ. 25 లక్షలు పోగొట్టుకున్న బాధితురాలు

ఆ నెంబర్‌ ద్వారా వాట్సాప్‌ ఛాటింగ్‌ కోసం యత్నించాడు. పటేల్‌ ఛార్మి పేరుతో పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి.. అమ్మాయిల ఫొటోలు పంపాడు. అయితే.. బుకింగ్‌ కోసం ముందుగా రూ.510 చెల్లించాలని కోరాడు. ఆ తర్వాత మరో రూ.5,500 పంపాలన్నాడు. మరోసారి మేసేజ్‌ చేసి.. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.7,800 పంపమన్నాడు. కక్కుర్తితో సదరు ఐటీ ఉద్యోగి కూడా వివిధ సందర్భాల్లో డబ్బులు పంపుతూ పోయాడు. అలా.. మొత్తం రూ.1.97 లక్షలు పంపినట్లు చెబుతున్నాడు. చివరకు.. అంతా మోసం అని గుర్తించి సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు (Crime cell) ఫిర్యాదు చేశాడు. ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ పోలీసులు సూచిస్తున్నారు.